సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనమండలి లో తిరుమల లడ్డు నెయ్యి వివాదంలో ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల అనుబంధంఫై ప్రతిరోజు శాసనమండలిలో చర్ఛ కోసం వైసీపీ ఎమ్మెల్సీ లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ చర్చకు అంగీకరించని ప్రభుత్వం నేడు, మంగళవారం అసెంబ్లీ లో చర్చ నిర్వహించింది. అయితే అక్కడ ఎప్పటిలానే వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే ఆ చర్చలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోసీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేడు ,తిరుమలకు నేయి సప్లైయి కల్తీ వివాదం లో సిబిఐ చార్జిషీట్లో పెట్టిన ఇందాపూర్ డైరీ తమ హెరిటీజ్ కు అనుబంధ సంస్థ కాదని, అయితే హెరిటేజ్ లో కొన్ని ఉత్పత్తులకు కో-మ్యానుప్యాక్చరింగ్ చేస్తోందన్నారు.. హెరిటేజ్ సంస్థ తమ కుటుంబ వ్యాపార సంస్థ అని, ఇప్పటివరకు హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా నీతి, నిజాయతీతోనే హెరిటేజ్ నిలబడిందని చెప్పారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరించి నీతి నిజాయతీతో హెరిటేజ్ సంస్థ వ్యాపారం చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే కావాలని గత పాలకులు చేసిన తప్పుల్ని మాపై రుద్దే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. భారతీ సిమెంట్స్ నుంచి ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో సిమెంట్ వినియోగించారని సీఎం ఆరోపించారు..రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటన జరిగితే.. దానిపై చర్చించకుండా ప్రతిపక్షాలు మండలిని అడ్డుకున్నాయని సీఎం ఆరోపించారు. నేడు, సీఎం చంద్రబాబు అడ్జక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు మంత్రి వర్గం 55 అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *