సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని సీఎం చంద్రబాబు ఆద్వర్యంలోని కూటమి సర్కార్ (AP Govt) నేడు, మంగళవారం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 40ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. మధ్యహ్న భోజన పథకం ద్వారా పేద ఇంటర్ విద్యార్థికి పౌష్టికాహరం అందడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని చంద్రబాబు సర్కార్ భావిస్తుంది.
