సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వయస్సు పెరిగే కొలది యువ హీరోలను మించిపోయే చలాకి గా మారిపోతూ.. వరుసగా అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, దాకు మహారాజ్ తో వరుసగా 4వ హిట్ సినిమా అందించిన బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి రోజు డాకు మహారాజ్ సినిమా 56 కోట్ల గ్రాస్ 2వ రోజు కలిపి 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదిలా ఉండగా అయితే ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడికి కోట్ల మంది భక్తులతో పాటు సాధువులు, అఘోరాలు భారీ సంఖ్యలో హాజరవుతారు.అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రని పార్ట్ 2 లో కంటిన్యూ చేస్తూ అఖండ పాత్ర కుంభమేళాలో ఉన్నట్టు, అక్కడ అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్టు, అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టు అన్ని లక్షల మంది జనాల్లో బాలయ్యతో షూట్ ప్లాన్ చేయడం, దానికి ధర్యంగా బాలయ్య ఒప్పుకోవడం, రియల్ లొకేషన్స్ లో రియల్ అఘోరాలతో షూట్ ప్లాన్ చేయడం సినీ చరిత్ర లో ఇదే ప్రధమం. అఖండ 2 సినిమాని సెప్టెంబర్ 25 దసరాకు రిలీజ్ చేస్తారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇది 4వ సినిమా కానుంది.
