సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఆగస్టు నుండి ఇక వరుస శుభ కార్యక్రమాలు, పండగల వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. రాను పోను రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకునే ఒక్కో ప్రయాణికులకు టికెట్ పై 20 శాతం తగ్గింపు లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.తాజగా ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో డిస్కౌంట్ రౌండ్ ట్రిప్ (ఇరువైపులా) టికెట్‌లపై మాత్రమే 20 శాతం ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణికుడు టికెట్స్ ఒకేసారి బుక్ చేసినప్పుడే ఈ రాయితీ వర్తిస్తుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చే ప్రయాణ వివరాల ఆధారంగా డిస్కౌంట్ వర్తించనుంది. ఇరువైపులా టికెట్‌లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే రెండు టికెట్లు ఒకే తరగతికి చెందినవై ఉండాలి. ఈ ఆఫర్‌కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ నియమం వర్తించదు. ఇది ప్రయాణికులకు అదనపు సౌలభ్యం.
