సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్ లో సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా (Maha Kumbh Mela )లో పాల్గొనేందుకు తొలిరోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంలో 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. నేడు, సోమవారంనాడు పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్, హర్యానా, బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వివిధ ఘాట్లు కిటకిలలాడాయి. మహాకుంభమేళా వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. పుష్పమాస పౌర్ణమి రోజున త్రివేణి సంఘంలో పవిత్ర స్నానాల కోసం విచ్చేసి సాధువులు, కల్పవాసీలు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేటి భక్తుల పుణ్య స్నానాల వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
