సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంచు మోహన్ బాబు సమర్పణలో తనయుడు మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న 100 కోట్ల భారీ సినిమా ‘కన్నప్ప’ (Kannappa) ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా లో పలు భాషలకు చెందిన అగ్ర నటులు పలు పాత్రలు పోషించారు. పరమ శివుని పాత్రలో అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ అగర్వాల్ పోషించగా నందీశ్వరుడి అంశగా రుద్ర ‘ పాత్రలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కీలక అతిధి పాత్ర పోషిస్తున్నారు. నేటి సోమవారం చిత్ర బృందం ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. “ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు ’’ ఇందులో రుద్ర (Prabhas As Rudra) పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
