సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంతకాలం వైసిపి పార్టీ విజయపధంలో పయనించడానికి తగు సూచనలు సర్వేలు చేసిన ఆస్థాన దర్శకుడు , రాజకీయ పుహకర్తగా కీలక పాత్ర పోషించిన ప్రశాంత కిషోర్ ను ఢిల్లీ వెళ్లి నారాలోకేష్ టీడీపీ ఆస్థానానికి రావాల్సినదనిగా ఆహ్వానించడం.. అతనితో చంద్రబాబు, లోకేష్ భేటీ కావడం చక చక జరిగిపోయాయి, ఒప్పదం కుదిరిందో లేదో తెలియదు కానీ.. ఈ తాజా పరిణామాలపై వైసిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేడు, ఆదివారం మాజీ మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి ‘అవుట్ డేట్ పొలిటిషన్’ చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా? అని ప్రశ్నించారు. అలాగే, గతంలో ప్రశాంత్ కిషోర్ ను బీహార్ ఓడు వచ్చి ఇక్కడ ఏమి పీకుతాడు? అని లోకేష్ దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లోబ్యాచ్ మరిచిపోయిందా? రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు.. ప్రశాంత్ కిషోర్ గురించి ఏం అన్నారో అందరికీ తెలుసు.. అయినా ఇప్పుడు ఐప్యాక్ తో ప్రశాం త్ కిషోర్ కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటికే మేము పూర్తిగా వాడేశాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పు కుని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాం తం. సీఎం జగన్ ప్రజలను నమ్ముకొన్నారు .. పీకే ను కాదు అన్నారు కొడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *