సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) గ్లింప్స్ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) టైటిల్ ను కూడా ఖరారు చేసారు,హిందూ పురాణాలలో కలియుగం చివరలో ప్రజలలో అజ్ఞానం పెరిగిపోయి ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు మహా విష్ణువు కల్కి రూపంలో వచ్చి దుష్టులను అంతం చేస్తాడని అనే కధ స్ఫూర్తి తో ఈ చిత్రం సాగనున్న ట్లు తెలుస్తోం ది. ‘వాటీజ్ ప్రాజెక్ట్ కె’ అనే ఒక్క డైలాగ్తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. హాలీవుడ్ సినిమా స్థాయి కి ఏ మాత్రం తగ్గని యాక్షన్ సీన్స్, విజువల్స్ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్ భవిషత్తు తరానికి చెందిన ఢిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో తోలి భారతీయ సినిమా గ చిత్ర బృందం గ్లింప్స్, టైటిల్ని ప్రకటించింది. హీరోలు ప్రభాస్, కమల్ హాసన్, నిర్మాత అశ్వనీదత్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొని,సందడి చేశారు. వీరితోపాటు రానా దగ్గుబాటి కూడా వెళ్లారు.దర్శకుడు నాగ్ అశ్వి న్ చేస్తున్న సోషియో ఫాంటీసి సినిమా ఇది..
