సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మహాశివరాత్రి సందర్భంగా నేడు, శనివారం మేడ్ ఇన్ భీమవరం బ్రాండ్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్-కె’ (Project K) పోస్టర్ ను విడుదల చేసి అభిమానులను చిత్ర యూనిట్ ఆనందపరిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ సినిమాలకు బిన్నంగా ఫాంటసీ సినిమా గా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయం తీ మూవీస్ తెలిపింది. ఈ పోస్టర్ లో భారీ చేయి కింద పడి ఉండగా, ముగ్గురు వ్యక్తులు గన్స్ తో చేయి వైపు గురి పెడుతూ నిలబడ్డారు. హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ తరహాలో ఉన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాను కూడా రెండు భాగాలుగా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన పురాణ చిత్రం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆది పురుష్’ సినిమాను వేసవి కానుకగా జూన్ 16న విడుదల చేయనున్నా రు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నా యి. మరోవైపు ప్రశాం త్ నీల్ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’ మూవీ సెప్టెంబరు 28న దసరా కు విడుదల ప్లాన్ చేసారు.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మారుతీ దర్శకత్వం లోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *