సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: పంజాబ్ లో ప్రధాని మోడీ కి భంగపాటు ఎదురయింది, నేడు, బుధవారం రోడ్డు ఫై పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా.. పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భఠిండా ఎయిర్‌పోర్ట్‌ అధికారులతో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ ఉదయం భఠిండా చేరుకున్నారు.అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉండగా.. వర్షం పడుతుండటంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద స్థానిక రైతులు ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చేతులు ఎత్తేసింది. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌ పైనే ఉన్న ప్రధాని..అసహనానికి లోనయ్యి తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *