సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైజాగ్ కు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చివరి దశకు చేరుకుంది, ఇక విమానాలు ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎల్లుండి అంటే.. ఈనెల 4న ఢిల్లీ నుంచి భోగాపురంలో ఫస్ట్ వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతుంది. కేంద్ర విమానాయన మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు అదే ఫ్లైట్‌లో భోగాపురం రానున్నారు. రన్ వే, ఏటిసి సెంటర్లు, టెర్మినల్ బిల్డింగ్ , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్, రాడార్ సిగ్నల్స్ ఇలా ATC వ్యవస్థలన్నీ దాదాపు పూర్తయ్యాయి. 2వేల 2వందల ఎకరాలు.. 4వేల 750 కోట్ల వ్యయంతో భోగాపురం ఎయిర్‌పోర్టును తొలి ఇంట్రిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుంది. ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఇక్కడ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నారు,. ఉత్తరాంద్రకు వరంగా భోగాపురం ఎయిర్‌పోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది.
