సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఈసారి సంక్రాంతి కి ప్రెవేటు వాహనాల ఆపరేటర్స్ ప్రయాణికులను అధిక చార్జీల పేరుతొ ఇబ్బంది పెడితే..బాధిత, నష్టపోయిన ,సంబంధిత ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు చేయాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. ఇందుకోసం 9281607001 నంబర్‌కు ఫోన్ చేసి గానీ లేదా వాట్సప్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. వెంటనే సంబంధిత ట్రావెల్స్ ఫై విచారణ చేసి చర్యలు తీసుకోని అవసరమైతే వారి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీనికోసం ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు రవాణాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ బృందాలు బస్టాండ్లు, ప్రధాన రహదారుల్లోని స్టాపింగ్ పాయింట్స్ వద్ద తనిఖీలు చేపడతాయని తెలిపారు.APSRTC వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *