సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పీఎస్ఎల్‌వి సి-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్‌ ప్రయోగం అద్భుత విజయం సాధించింది. ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధలనకు గానూ ఈ ప్రోబా-3 ఉపయోగపడనుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్‌గా అధ్యయనం చేయనున్నాయి. నిజానికి ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం… నిన్న మధ్యాహ్నం 2:38 నిమిషాలకు శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్నినేటి గురువారానికి వాయిదా వేశారు. నేటి గురువారం సాయంత్రం 4:12 గంటలకు ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సి-59 ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *