సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం పురపాలక సంఘం పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం మరియు వాడకంపై అమలు జరుగుతున్న నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గత సాయంత్రం స్థానిక పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జిల్లా కలెక్టర్ మరియు పురపాలక సంఘ ప్రత్యేక అధికారి& జాయింట్ కలెక్టర్ వార్ల ఆధ్వర్యంలో పురపాలక సంఘ కమిషనర్, మునిసిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది, మెప్మా మరియు స్వయం సహాయక బృందాల సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు మరియు విద్యార్థినీ విద్యార్థులతో వందలాది మందితో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి అంబేద్కర్ సెంటర్ వరకు అఖండ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలి అనంతరం మానవహారం గా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధం మరియు పర్యావరణ పరిరక్షణ పై ప్రతిజ్ఞ చేయడం జరిగింది.( ఫై చిత్రంలో చూడవచ్చు
