సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తేదీ.01.11.2022 నుండి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యాన్నెర్స్ పై నిషేదం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం నెం. 1320, తేదీ: 22.09.2022 నందు నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ఈ నేపథ్యంలో భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల ఫ్లెక్సి తయారీ దారులకు, ప్లాస్టిక్ వస్తువులు అమ్మ వ్యాపారస్తులకు ఈరోజు, శుక్రవారం మునిసిపల్ కమీషనర్, శివరామ కృష్ణ తన చాంబర్ నందు అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగముగా ఫ్లెక్సీ తయారీదారులకు మరియు ఉపయోగించువారికి ఇకపై ప్లాస్టిక్ ప్లెక్సీలు వినియోగించే పక్షములో చెల్లించవలసిన పెనాల్టీలు,సీజింగు మరియు ప్రాసిక్యూషన్ మొదలగునవి పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలిపారు. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాన్నెర్స్ ను మాత్రమే ఉపయోగించవలసినదిగా ఆదేశించారు. పట్టణంలో గల ప్లాస్టిక్ వ్యాపారస్తులు అందరూ ప్లాస్టిక్ వస్తువులను అనగా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు మొదలగుననవి నిషేదించినందున వాటి స్థానే ప్రత్యామ్నాయంగా గుడ్డ, లేదా జూట్ సందులు మాత్రమే వినియోగించవలసినదిగా ఆదేశాలు ఇచ్చారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *