సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కారికమాసం ముగిసాక తగ్గవాల్సిన కూరగాయలు (VEG) ధరలు మరింత పెరిగిపోవడం అందరిని విస్మయ పరుస్తుంది. దీనితో పెరిగిన ధరలు విని కేజీల్లో కొనుగోలు చేసేవారు కొనుగోళ్లు తగ్గిస్తున్నారు.నిత్యావసర కూరగాయలు అయిన ఉల్లి, టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. తాడేపల్లి గూడెంలో హోల్ సెల్ మార్కెట్ లో నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.2300 నుంచి 2500 కాగా ఈ వారం ఒకేసారి రూ.3వేలకు పెరిగిపోయి 28,000 కు చేరింది. ఉల్లి క్వాలిటీ బట్టి రిటైల్ గా కిలో మరల 30 రూపాయలా పైమాటే పలుకుతుంది. టమాటా కేజీ 50 రూపాయలు ఫై మాటే.. మార్కెట్ లో కేజీ చప్పున బీరకాయ 70, పెన్నాడ వంకాయ, 110 రూపాయలు బెండ, కాకర, బీట్‌రూట్‌, పెండలం, కంద కిలో రూ70- .80 చొప్పున విక్రయిస్తున్నారు. దొండ రూ.50, దోస రూ.50, క్యారెట్‌ రూ.70, క్యాప్సికమ్‌ రూ.90, కీరదోసకాయ కేజీ 50 రూపాయలు నాటు చిక్కుళ్లు రూ.130, చిన్న కాలీఫ్లవర్‌ ఒకటి రూ 35-.40, క్యాబేజీ కిలో రూ.40 ధరకు అమ్ముతున్నారు.. ఆఖరికి 30 కోడిగ్రుడ్ల హోల్ సేల్ ధర 200 రూపాయలు దాటిపోయింది. రిటైల్ గా గుడ్డు 8 రూపాయలకు చేరిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *