సిగ్మాతెలుగుడాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా అద్నాన్ నయీం అస్మి, ఐపిఎస్., నేడు, బుధవారం భీమవరం లోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జిల్లాలో మహిళల రక్షణకి అధిక ప్రాముఖ్యత ఇస్తాము అదే విదంగా చిన్న పిల్లల మీద జరిగే దాడులు ను అరికడతాము అని, ఆ నేరాలలో ముద్దాయి లకు త్వరితగతిన ట్రెయిల్ నిర్వహించి కోర్టు లో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలేజీ ల వద్ద, స్కూల్ ల వద్ద ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ లేకుండా నిరంతర గస్తీ నిర్వహిస్తాము. యువత గంజాయి ఇతర మత్తు మందు వ్యసనాల కు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే కాదు.వ్యసనపరులను కౌన్సిలింగ్ మరియు deaddiction సెంటర్స్ కి పంపుతాం. జిల్లాలో గంజాయి,నిషేదిత డ్రగ్స్ ను రవాణా చేసే వారిని వాటి మూలాలను గుర్తించివాటిని లేకుండా చేస్తాము అని తెలిపారు. నేరాలు జరగకుండా రాత్రి పూట ఎక్కువ బిట్ లు తిరిగేవిధంగా చూస్తాం అని తెలిపారు. రౌడీ షీటర్ ల మీద నిరంతర నిఘా ఉంటుంది ఎవరైనా రౌడీ షిటర్ లు పరిది దాటి ప్రవర్తిస్తే వారిమీద చట్టపరంగా PD యాక్ట్ అమలు చేస్తాం. మొబైల్, ఇంటర్ నెట్ ఆధారంగా జరిగే సైబర్ క్రైమ్ కు సంబంధించి జిల్లాలో సైబర్ క్రైమ్ కట్టడి చేయడానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో ప్రజలు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు ,అదనపు ఎస్పీ (SEB) ఎ.టి.వి రవికుమార్ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ డి.ఎస్. ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి గారు, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ వి.నారాయణ స్వామి రెడ్డి నర్సాపురం సబ్ డివిజన్ డీఎస్పీ జి. శ్రీనివాస రావు, జిల్లా ఆర్మ్ రిజర్వ్ డీఎస్పీ ఎం. సత్యనారాయణ , దిశా డీఎస్పీ నున్న మురళీ కృష్ణ , SB & DCRB ఇన్స్పెక్టర్లు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
