సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్లో ఉల్లి ధర తగ్గుతుంది. ఉభయ గోదావరి జిల్లాలకు కీలక ఉల్లి హోల్ సేల్ మార్కెట్ అయినా తాడేపల్లి గూడెం లో అకస్మాత్తుగా ఉల్లి ధర తగ్గించి అమ్మడంతో జిల్లా వ్యాప్తంగా హోల్ సేల్ ధరలు బాగా తగ్గాయి. వర్షాలు కారణంగా కొంత నాణ్యత లోపించిన ఉల్లి ధర మరింత తగ్గిపోయింది. క్వింటా ఉల్లి సైజును బట్టి రూ. 500 నుంచి 1000 ధరకు అమ్మకాలు చేసారు. మహారాష్ట్ర నుండి ఇక్కడకు వస్తున్నా ఉల్లికి క్వింటా హోల్‌ సేల్‌ రూ.1500 నుంచి 2000 వరకు ఇంకా అమ్మకాలు చేస్తున్నప్పటికీ అనుకోకుండా. కర్నూలు నుంచి మంచి దిగుబడులతో లారీల ఉల్లి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తరలి రావడంతో ఉల్లి మరింత అందుబాటు ధరలకు వచ్చింది. కొందరు రిటైల్ వ్యాపారాలు ఇంకా ఉల్లి ధర నిలబెట్టి కేజీ కి 35 రూపాయలు అమ్ముతున్నప్పటికీ తాజా ధరల ప్రకారం రూ.100కు నాలుగు కేజీలు, నాసిరకం కలిపి రూ.100కు 5 కిలోల వంతున అమ్ముతున్నారు. పచ్చిమిర్చి ధర మాత్రం రిటైల్ గా కేజీ కి 80 ఫై స్థాయికి పెరిగిపోయింది. టమాటా కూడా 50 రూపాయలు పలుకుతుంది. మిగతా కూరగాయలు ధరలు కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆకూ కూరలు దొరకటమే కష్టంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *