సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్ జిల్లాలోని పోలీసు అధికారులను ఆదేశించారు. నేడు, గురువారం నాడు జిల్లా ఎస్పీ గారు తన క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలోని డి.ఎస్.పిలు, సి.ఐలు మరియు ఎస్.ఐలతో ‘జూమ్ వీడియో కాన్ఫరెన్స్’ ద్వారా నెలవారీ నేర సమీక్షా లో భాగంగా 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన నేరాల దర్యాప్తు పురోగతిని ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.’డయల్ 112′ కాల్స్‌కు స్పందించడంలో జిల్లా పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరించాలని, బాధితులకు తక్కువ సమయంలోనే సహాయం అందించడం ముఖ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *