సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పక్షులు కోళ్లు సామూహికంగా చనిపోతుడటం బర్ద్ ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో.. మనుష్యులకు కూడా ఈ వైరస్‌ సోకితే సాధారణ ఫ్లూ, జ్వరం, గొంతునొప్పి.. వంటి కొవిడ్‌ లక్షణాలు బాధపడతారని,వీరు వెంటనే తమను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్యులు అంటున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, నిర్లక్ష్యంగా ఉంటే వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. . మన దేశంలో ఉండే అనువైన వాతావరణం దృష్ట్యా ఏటా విదేశీ పక్షులు వలస స్తుంటాయి. ముఖ్యంగా సెప్టెంబరు నుంచి మార్చి వరకు వచ్చే వలస పక్షుల ద్వారా ఇతర పక్షులు, జంతువులతో పాటు మానవులకు వైరస్‌ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో తణుకు పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్న కోడి పౌల్ట్రీల యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వైరస్‌ సోకిన పక్షులను నేరుగా ముట్టుకోవడం, వాటి పరిసరాలు, వైరస్‌ సోకిన పక్షుల (కోళ్లు) మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తుంది.ముఖ్యంగా హోటల్స్ రెస్టారెంట్ లవారు చికెన్ బాగా ఉడికించాలి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వైరస్‌ బతకలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందుకే బాగా ఉడికించిన మాంసం లేదా కోడి గ్రుడ్ల ద్వారా వైరస్‌ సోకే ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *