సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలను మరింత పెంచి ఆదాయం బాగా పెంచుకోవాలని భావిస్తుంది. అందుకే పలు జిల్లాలలో ప్రైవేటు మద్యం పాలసీలో లైసెన్స్‌దారులకు ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను అనధికారికంగా నిర్దేశిస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.170 కోట్ల అమ్మకాలు సాగించాలని ? టార్గెట్ పెట్టినట్లు సమాచారం. మద్యం షాపులు, బార్ లైసెన్స్ దారులు ఈ నెల 31 నాటికి టార్గెట్ పూర్తి పూర్తీ చేసి ఇదే నెలలో లైసెన్స్ రుసుము కూడా చెల్లించాలి. దీనితో డబ్బు ఎక్కడినుంచి తెచ్చేది? జనాన్ని మరింత ఎలా తాగించాలి? నెలకు 120 కోట్లు అమ్మకాలే ఎక్కువ అనుకొంటే అమ్మిన అమ్మకపోయిన రూ.170కోట్ల టార్గెట్ ను ఎట్లా పూర్తీ చెయ్యాలి అని ఆందోళన చెందుతున్నారు.
