సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తొలివిడతలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు, జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మొత్తం 2,15,082 మంది బాలబాలికల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో అర్హులయిన 1,40, 764 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు ఒక్కొక్కరికి 13వేల రూపాయలు చప్పున జమా చేసిన జమ చేసిన నేపథ్యంలో.. తాజాగా ప్రస్తుత విద్యాసంవత్సరం (2025–26)లో కొత్తగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈనెల 5వ తేదీ వరకు ఒకటో తరగతి అడ్మిషన్లు తీసుకున్న 22,233 మంది, జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పొందిన 16,757 మంది విద్యార్థులకు తల్లికి వందనం ఆర్థిక సాయాన్ని అందజేసే ఈ క్రమంలో జిల్లాలో ఒకటో తరగతి లో చేరిన బాలబాలికల్లో 4,156 మంది విజ్ఞప్తులకు సంబంధించి వివరాలు మరోమారు పరిశీలించి నేడు మంగళ, బుధవారాల్లో అర్హులైన తల్లుల ఎంపిక జాబితాలను విడుదల చేస్తారని విద్యాశాఖవర్గాలు వివరించా యి. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈనెల 10న తల్లికి వందనం ఆర్థికసాయాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు జిల్లా ఎస్సీ సంక్షేమ,శాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *