సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు సమష్టి కృషి ఫలితంగా గత ఏడాది కంటే గణనీయంగా నేరాలు తగ్గాయని నేడు, మంగళవారం, భీమవరంలో జిల్లా ఎస్పీ, అద్నాన్ నయీం అస్మి, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు ….ఆయన మాటలలో.. గత ఏడాదితో పోలిస్తే పోలీస్ నిరంతర నిఘా ఫలితంగా జిల్లాలో 19.03% నేరాలు తగ్గాయి. ఇంకా ఆస్తి నేరాల్లో 26% తగ్గుదల కనిపించింది. ఇక సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి రూ. 96.92 లక్షల నగదు హోల్డ్, రూ. 42.10 లక్షల రికవరీ చెయ్యడం జరిగింది. జిల్లాలో గంజాయి నిర్మూలన దిశగా పటిష్ట చర్యలు.చేపట్టి 1236 కేజీల గంజాయి ధ్వంసం.చేసాము, మహిళల భద్రతకు పెద్దపీట.వేసాము..లైంగిక నేరాలకు పాల్పడే 68 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసాము. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, 3742 సీసీటీవీ కెమెరాలు మరియు 3 డ్రోన్ల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిరంతర పహరా.చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం రోడ్డు ప్రమాదాలు 8% తగ్గగా, ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు 7%, గాయాలు 20% తగ్గాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ, ఎం.వి.వి సత్యనారాయణ, భీమవరం డిఎస్పీ. రఘువీర్ విష్ణు , నరసాపురం డివిజన్ డిఎస్పీ జి.శ్రీ వేద , తాడేపల్లి గూడెం డివిజన్ డీఎస్పీడి.విశ్వనాథ్ , డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్, దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
