సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్ర సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్,సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం కొత్తగా 55.37 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల పనులు ప్రారంభించగా 53.54 కిలోమీటర్ల మేర నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు, ఆవుల కోసం నిర్మిస్తున్న గోకుల్ షెడ్ల నిర్మాణాల వివరాలను తెలిపారు.. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
