సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ వాసులు ఎంత వ్యతిరేకించినప్పటికీ నిర్ధాక్షణ్యంగా ప్రతి ఏడాదికి 15 శాతం చప్పున అదనపు ఆస్తి పన్ను బాదుడు ను ప్రెవేశపెట్టిన నేపథ్యంలో దానిని తాము అధికారంలోకి వస్తే సవరిస్తామని ప్రకటించిన కూటమినేతలు.. గత ఏడాదిగా భారీ ఆదాయం కోసం అదే వైసీపీ ప్రభుత్వ సంప్రదాయాన్ని అమలు చేస్తుంది. ఆ ఆదాయం కూడా సరిపోక ప్రతి ఏడాదికి మునిసిపాల్టీల్లో ఇంకా 20 శాతం ఆస్తి పన్ను వసూళ్లు పెరగాలనే లక్ష్యంతో అధికారులు ఇంటింట సర్వే చేపట్టారు. దాని పర్యవేక్షణలో భాగంగా 2021లో క్యాపిటల్ విలువ ద్వారా నిర్ణయించిన పన్నుల్లో తగ్గిన అసెస్‌మెంట్‌లలో ర్యాండమ్‌గా గుర్తించి వాటిని ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు మునిసిపాల్టీలకు ప్రత్యేక బృందాలు 372 ఆస్తుల ఎస్‌ఎస్‌మెంట్‌ల ను పరిశీలించి ఈ నెల పదో తేదీ, రేపటి లోగా నివేదిక సిద్ధం చేస్తున్నారు. వీటిలో భీమవరం 74, తాడేపల్లిగూడెం 116, తణుకు 105, నరసాపురం 6, పాలకొల్లు 13, ఆకివీడు 58 ఎంపిక చేశారు. భీమవరం మునిసిపాల్టీకి పాలకొల్లు కమిషనర్ విజయసారధి, రెవెన్యూ ఇనస్పెక్టర్ టి.బద్రీనాద్, ఇద్దరు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు.
