సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీగా భీమవరం లో విధులు నిర్వహిస్తున్న వి. భీమరావును ప్రభుత్వం తాజగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దానికి తగిన కారణాలు లోకి వెళితే.. చేసింది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అక్కడ విధులు నిర్వహించిన 4 గురు పోలీసు అధికారులపై ఇటీవల కూటమి ప్రభుత్వం దర్యాప్తు పూర్తీ చేసి చర్యలు చేపట్టింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీసీ నేత అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన ఆరోపణలపైఅప్పట్లో అక్కడ డీఎస్పీగా ఉండి.. మృతుడి కుటుంబ సభ్యులు పిర్యాదు చేసిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీగా విధులలో ఉన్న వి. భీమరావును మరియువెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి ప్రస్తుతం బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో కేసు నమోదైన సర్పవరం స్టేషన్‌ ఎస్‌ఐగా ఉండి, ప్రస్తుతం కాకినాడ పోర్టు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎన్‌.సతీష్ బాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *