సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే నీరు ఎండగట్టిన పంటకాలువలులలో మరల గోదావరి నది నీరు వదిలే సమయం దగ్గర పడుతుంది. దీనితో ఇరిగేషన్ అధికారులు డ్రెయిన్ల నిర్వహణ పనులను అత్యంత నాణ్యతతో త్వరితంగా పూర్తీ చెయ్యాలని భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు మంజూరైన ఇరిగేషన్ ఓ అండ్ ఎం పనుల నిర్వహణ కోసం డ్రెయిన్లు, కాలువల్లో చెత్త, నాచు గుర్రపు డెక్క తూడు తొలగింపు, పూడికతీత పనులకు, గట్లను పటిష్టపరిచేందుకు కాలువలకు సంబంధించి రూ.13.66 కోట్లు, డ్రెయిన్స్‌కు సంబంధించి రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. సాగు, తాగునీటి ఇబ్బంది లేకుండా పనులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. భీమవరంలోని ప్రధాన కాలువలో పేరుకుపోతున్న చెత్తను 15 రోజులకొకసారి తొలగిస్తునే ఉండాలని ఆదేశించారు.ఆకివీడు సమీపంలోని ఉప్పుడేరు డ్రెడ్జింగ్ పనులకు రూ.6 కోట్లు, రూ.3 కోట్లు రెండు ప్యాకేజీల కింద మొత్తం రూ.9 కోట్లు మంజూరయ్యాయని, టెండర్స్ పిలవడం జరిగిందన్నారు. సమావేశంలో ఈఈ పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, డ్రెయిన్ల శాఖ ఈఈ సీహెచ్.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
