సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్ పనుల వల్ల పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. వీటి ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా ప్రయాణికులపై పడనుంది. ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 3 వరకూ మూడు రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేసారు. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌.. మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రద్దు కానున్నాయి.ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 4 వరకూ మూడు రైళ్లు రద్దు చేసారు. . వాటిలో రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌.. విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌.. విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌‌లు రద్దు చేస్తున్నారు. . ఇక నవంబర్‌ 27, 28, 29, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో 2 రైళ్లు రద్దు కానున్నాయి. విజయవాడ-విశాఖ రైలు.. విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు కానున్నాయి. ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 3 వరకు 2 రైళ్లు రద్దు చేయడం జరిగింది. కాకినాడ-విశాఖ మెమూ స్పెషల్‌ రైలు.. విశాఖ-కాకినాడ మెమూ స్పెషల్‌ రైలు రద్దు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *