సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, గురువారం భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ బాధ్యతారహిత పార్టీల నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అవి మానుకోవాలి అన్నారు. కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బారి నుండి లాభాలబాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం అన్నారు. ఇటీవల 11,500 కోట్లు ఇచ్చింది నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను కాపాడేందుకే అన్నారు. అయితే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం GST తగ్గిస్తూ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వేలు, జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లా మీదుగా 165 జాతీయ రహదారి విస్తరణకు 3200 కోట్లుతో DPR సిద్ధం అయిందన్నారు. త్వరలో నరసాపురం – చెనై వందే భారత్ రైలు ప్రారంభం అవుతుందన్నారు. అత్తిలి రైల్వే స్టేషన్ లో త్వరలో రెండు ఎక్స్ ప్రెస్ లకు స్టాప్ లు ఇస్తామన్నారు. 25 రూ. కోట్లతో అభివృద్ధి జరుగుతున్న తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ కి మరో 18 కోట్లు మంజూరు అయ్యాయని.. ఇటీవల ప్రారంభించిన స్పెషల్ రైలు నరసాపురం – అరుణాచలం ఎక్స్ ప్రెస్ ను రెగ్యులరైజ్ చేస్తాము అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *