సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 9 నగర పాలక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలాన్ని మరో 6 నెలలు (06-11-2025 నుండి 05-05-2026 వరకు) పొడిగిస్తూ తాజగా ఉత్తరువులు వెలువడ్డాయి. దీనిలో భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పదవి కాలం కూడా పొడిగించబడింది. నిజానికి ఈ స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం 05-11-2025 నాటికి ముగియాల్సి ఉంది. పొడిగింపు పొందిన, మున్సిపాలిటీలు:▪️భీమవరం▪️రాజం▪️రాజమహేంద్రవరం▪️తాడేపల్లిగూడెం▪️పాలకొల్లు▪️తణుకు▪️గూడివాడ▪️బాపట్ల▪️గూడూరు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే వరకు లేదా 6 నెలలు పూర్తి అయ్యే వరకు ఈ స్పెషల్ ఆఫీసర్లు విధుల్లో కొనసాగుతారు.
