సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–3 ఏఎన్ఎం(హెల్త్ సెక్రటరీ) ఉద్యోగులకు ఇటీవల జరిగిన బదిలీల్లో తాజాగా మరోసారి మార్పులు జరిగాయి. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు ముగిసిన ఏఎన్ఎంలకు ఈనెల మొదట్లో జరిగిన బదిలీల కౌన్సెలింగ్పై వివాదాలు తీవ్ర అసంతృప్తి చెలరేగిన నేపథ్యంలో ఈమేరకు బదిలీలు ఖరారైన 594మంది ఏఎన్ఎంలను విధుల నుంచి రిలీవ్ చేయవద్దని, ఆ మేరకు తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు ఎక్కడివారక్కడే పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. పలువురి స్థానాలను సవరిస్తూ మొత్తం 584మంది రూరల్ ఏఎన్ఎంలతో కూడిన జాబితాను మొన్న శుక్రవారం రాత్రి విడుదల చేయగా, శనివారం ఉదయం నుంచే పలువురు ఉద్యోగులు ఫిర్యాదులతో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. అయితే బదిలీపై మొన్న శనివారం కొత్తస్థానాల్లో చేరిన వారికీ కొత్త సమస్యలు? తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సచివాలయ ఏఎన్ఎంల బదిలీలపై వస్తున్న ఫిర్యాదులపై డీఎంహెచ్వో డాక్టర్ పీ.జే.అమృతం మాట్లాడుతూ.. బదిలీలు ఖరారైన ఏఎన్ఎంలలో కొందరు తమ పనిస్థానాలు, మండలాల పేర్లలో తప్పులు దొర్లాయని శనివారం ఫిర్యాదు చేశారని, వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా కార్యాలయ సిబ్బందిని ఆదేశించానన్నారు. నేటి సోమవారం ఈ బదిలీల సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
