సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:చట్టప్రకారం సక్రమం కానప్పటికీ.. సంక్రాంతి సంప్రదాయం పేరిట పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగాగత 3 రోజులుగా హైటెక్ పద్దతులలో జరిగిన కోడి పందాలకు ముగింపు పలికారు. నేడు, శనివారం ముక్కనుమ 4వ రోజు పండుగ బంధుమిత్రులు ఇంటి విందులకు తిరుగు ప్రయాణాలకు పరిమితం అయ్యారు. ఇక సంక్రాంతి పండుగ సంబరాలు భీమవరం, ఉండి పరిసరాలలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుండి వచ్చిన అతిధులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వారు మరోసారి వచ్చే విధంగా జరిగాయి. ఇక పందాలలో కోళ్లు కత్తులు దూశాయి. ఈ మూడురోజులకు జిల్లాలోదాదాపు 350 కోట్ల మేర చేతులు మారినట్లువిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రతి బరి సమీపంలోని గుండాట, పేకాట, మూడు ముక్కలాట, కోతాట, లోనా బయట వంటి జూదాలు పెద్దఎత్తున నిర్వహించారు, దానికి తోడు మద్యం విచ్చలవిడి ధరలకు కోట్లాది రూపాయలు అమ్మకాలుజరిగాయి. కోడి పందేలు నిర్వాహకులు ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించారు. తాడేపల్లి గూడెం బరిలో ఒక వ్యక్తి అత్యధికగా కోడిపందాలపై కోటిన్నర గెలుచుకొన్నాడని వార్త సమాచారం. భీమవరం మండలం తాడేరులో ప్రహర్ష అనే యువ కుడు 2 లక్షల రూపాయలు చొప్పున ఏకంగా 5 పందేలు గెలిచి బోనస్ గా బుల్లెట్‌ను సొంతం చేసుకున్నాడు.
