సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో డీజిల్ ఇంధనం వాడే రవాణా వాహనాలపై అదనంగా త్రైమాసిక గ్రీన్ టాక్స్ 25 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల గజిట్ కూడా విడుదల చేసింది. వచ్చే ఫిబ్రవరి నుంచి బాదుడుకు సిద్ధమవుతోంది. దీంతో సర్కారు తీరుపై రవాణా వాహన యజమానులు జగన్ సర్కార్ కు విజ్ఞప్తి లు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే రవాణా రంగం పుంజుకుంటోంది. ఈ సమయంలో అమాంతంగా క్వార్టర్ ట్యాక్స్ పెంచడం ఎంతవరకూ సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో 2021, డిసెంబర్‌లో జీవో నెంబరు 67 జారీ చేసి రూ. రూ. 20 వేల వరకు పెంచారు. రాష్ట్రంలో ఇప్పటికే డీజీల్, పెట్రోల్‌పై అదనపు వ్యాట్ రూ.4 వసూలు చేస్తున్నారు. లీటర్ డీజీల్ ధర రూ. 99.22గా ఉంది. దేశంలో పెట్రో ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, ఛత్తీస్‌ఘడ్‌తో పోలిస్తే ఏపీలో డీజీల్ లీటర్‌కు రూ. 5 అదనంగా ఉంది. కర్ణాటక, తమిళనాడు కంటే పెట్రో ధరలు అధికంగా ఉన్నాయని లారీ ఓనర్లు అంటున్నారు. ఇప్పటికే ఉన్న పన్నుల భారానికి తోడు మళ్లీ మరో 25శాతం వరకు త్రైమాసిక పన్నును పెరగనుండడంతో వాహనదారులు అసహనంగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పునరాలోచించాలని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు సీఎం జగన్‌కు లేఖ రాయడం జరిగింది.
