సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో రెండు రోజుల్లో ఆకాశంలో భూమికి దగ్గరగా వస్తున్నా తోక చుక్క అద్భుతం చూడనున్నారు. గ్రీన్ కొమెట్గా పిలిచే ఆ ఆకుపచ్చ రంగు తోక చుక్క ను దక్షిణ భారతీయులు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, గుంటూరు వాసులతో పాటు ఉమ్మడి కృష్ణ జిల్లాల వాసులు అయితే చాల స్పష్టంగా వీక్షించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం , సప్తర్షి మండలం మధ్య లో ఈ తోక చుక్క కనిపించనుంది. ఎప్పుడో మంచు యుగం లో 50 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క ప్రస్తుతం కనిపించనున్నట్లు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. తోక చుక్కలు అంటే వాయువులతో నిండిన అంతరిక్ష మంచుగోళాలు.సూర్యుడికి దగ్గరగా వచ్చి నప్పు డు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకుఅవి తోకతో కనిపిస్తాయి అని శాస్త్రవేత్తలు చెబుతుంటే .. పలువురు జోతిష్కులు అయితే ఎదో మహత్తు జరిగేముందు కానీ, ఉపద్రవం వచ్చే ముందు తోక చుక్క ఒక సంకేతం అని భావిస్తుంటారు.
