సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ఏ ఆర్టిస్ట్, సీనియర్ ప్రముకుడో కష్టాలలో ఉన్న సినీ ప్రముఖులు లక్షో, 2 లక్షలో 5 లక్షల్లో ఆర్ధిక సాయం చేసి తమ వంతు ఉదారత చాటుకోవడం చూస్తుంటాం.. ఇక ఇప్పుడు.. ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలులో గ్యాంగ్ విలన్లలో ఒకరిగా కనిపిస్తూ అమాయక పంచ్ డైలాగ్స్ విసిరే ఫిష్ వెంకట్ (Fish Venkat) హాస్పిటల్ బిల్స్ అన్ని తానే చూసుకుంటానని ప్రభాస్ (Prabhas) మాట ఇచ్చారట..కొన్నిరోజులుగా ఫిష్ వెంకట్ కు కిడ్నీలు దెబ్బతినడంతో కుటుంబసభ్యులు ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి ఇంకా విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఇక తన తండ్రి అనారోగ్యం గురించి చెప్తూ ఆర్థిక సాయం కావాలని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఒక వీడియో ద్వారా వేడుకుంది. ఆ వీడియో చూసిన పాన్ ఇండియా సూపర్ స్టార్.. దాత్రుత్వంలో భీమవరం బ్రాండ్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.ఆయన మనిషి స్రవంతి కి ఫోన్ చేసి ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు స్రవంతి మీడియా ద్వారా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *