సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ..స్కిల్స్ డెవలెప్మెంట్ స్కాం లో క్వాట్ పిటిషన్ విచారణలో ఏపీ ఏసీబీ కోర్డు కు చంద్రబాబు ను జైలు రిమాండ్ లో పెట్టి విచారించే అధికారం ఉందని తీర్పు చెప్పి షాక్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం మరో, ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం కేసులో.. ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ జరగాల్సిన విచారణ నిలిచిపోయింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుడగా.. తమ ఇద్దరి బెంచ్ ఈ రోజు కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ద బోస్ స్పష్టం చేశారు. తదుపరి విచారణ తేదీని త్వరలోనే తెలియజేస్తామన్నారు.17-ఏ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ఈ కేసును సుప్రీంకోర్టు గతంలో వాయిదా వేసింది అని భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (నిన్న) సెక్షన్‌ 17-ఏపై ధర్మాసనం లో ఇద్దరు జస్టిస్ లు భిన్న తీర్పులు వెలువరించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *