సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై ‘సిద్ధం’ సభలో వైసీపీ కార్యకర్తలు జరిపిన మూకుమ్మడి దాడి అప్రజాస్వామ్యం, అమానుషమని వివిధ జర్నలిస్టు సంఘాలు, టీడీపీ జనసేన తదితర రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దాడికి నిరసనగా నేడు, మంగళవారం భీమవరం మీడియా ప్రతినిదుల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్స్ , వీడియోగ్రాపర్స్ కు ప్రాణ రక్షణ, భద్రత కల్పించాలని భీమవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద APWJF ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. భీమవరం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భీమవరం ప్రెస్‌క్లబ్‌ సభ్యులు కలెక్టరేట్‌ స్పందనలో భీమవరం ఆర్డీవో శ్రీనివాసులురాజుకు వినతి పత్రం అందజేశారు. ఫొటోగ్రాఫర్ ఫై దాడికి పాల్బడిన వారిపై ప్రభుత్వం తక్షనమ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *