సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంద్ర తెలుగుదేశం నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్య న్న పాత్రుడిని సీఐడీ పోలీసులు అనకాపల్లి లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్ ను కూడా అదుపులోకి తీసుకున్నా రు. వీరిని నేటి ఉదయమే ఏలూరు జైలుకు తరలించారు. గతంలో మంత్రిగా ఉన్నపుడు అయ్యన్న ఇంటి నిర్మాణంలో ఇరిగేషన్ కాలువకు చెందిన భూమిని తన స్వంత ఇంటి నిర్మాణం కోసం ఆక్రమించి అందులో గోడ కట్టడంతో ఆ ఇంటిగోడను కొంతకాలం క్రితం కూల్చివెయ్యడానికి వెళ్లిన రెవెన్యు ఉద్యోగులకు అది తన స్వంత స్థలం అని ఇంటి గోడ కూల్చి వేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్న పై అభియోగాలున్నాయి. అవి నిజంగా ఫోర్జరీ పత్రాలు అని నిర్ధారించిన సిబిఐ పోలీసులు ఈకేసులో మొదటి నిందితుడిగా అయ్యన్న పాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ఉన్నా రు. ఈ నేపథ్యం లో నర్సీపట్నం లో గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు.. అనంతరం అయ్య న్న కు నోటీసులు అం దజేసి అరెస్టు చేశారు. అయ్యన్న పై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కిం ద కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *