సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా నేడు, శనివారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ క్రింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సి ల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉండటం గమనార్హం. ఈ బ్యాంకులు కేంద్ర గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పనితీరు విషయంలో అంత ఆశాజనకం గా లేకపోవడం వల్ల ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది. 2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. 2014 తర్వాత మొత్తం 60 సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం .ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లోకాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *