సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలే శుభకార్యాలు పెళ్లిళ్ల సీజన్..ఇటీవల రోజు రోజుకు దూసుకొనిపోతున్న బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిపోతున్నాయి. అయితే బంగారం, వెండి తప్పనిసరిగా కొనాలనుకునే ప్రతి ఒక్కరూ కాస్త ధర తగ్గితే బాగుండు అని ఎదురు చూసేవారు ఎక్కువగానే ఉన్నారు. అంటువంటి వారికీ ఓదార్పుగా ఇటీవల గత 3 రోజులుగా కాస్త ధరలు దిగివచ్చి స్థిరంగా ఉన్నాయి. తాజగా తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్ లలో నేడు, నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 60,930కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.77,400 ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *