సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు మరల గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా నేడు, గురువారం 24 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 11 పెరిగి రూ. 9,917గా ఉండగా, 22 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 10 పెరిగి రూ. 9,090గా ఉంది. అలాగే 18 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 8 పెరిగి రూ. 7,438గా ట్రేడవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు.. హైదరాబాద్ , విజయవాడ, విశాఖల నగరాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,180.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,910..ఇటీవల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నా 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,390గా కొనసాగుతున్నాయి.
