సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాస్త తగ్గి మరోసారి భారీగా పెరిగిపోయి దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరల్లో ఒక్క సారిగా తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో గత శుక్రవారం ఒక్క రోజులోనే ఔన్సు (31.10 గ్రాముల) 24 క్యారెక్ట బం గారం ధర 80 డాలర్లకు పైగా తగ్గడం, వెండి ధర కూడా కిలోకు భారీగా పతనం కావడం తో మన దేశంలో కూడా ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో శుక్రవారం అర్ధరాత్రి నుండి నేటి శనివారం ఉదయం వరకు 10 గ్రాముల (24 క్యారెట్ల) బంగారం ధర రూ.2,400 తగ్గి రూ.91,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1600లకు పతనమైంది కిలో వెండి ధర రూ.8,000కు పైగా తగ్గి రూ.89,800 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. ఈనెల 1న 10 గ్రాముల 24క్యారెట్ బంగారం రూ.94,000 పైగా దాటగా, ఇప్పుడు రూ.3,000 తగ్గింది. కిలో వెండి ధర 2 రోజుల్లోనే రూ.1.02 లక్షల నుంచి రూ.12,000కు పైగా భారీగా తగ్గటం విశేషం..
