సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ భద్రతా ఫై రాష్ట్ర అసెంబ్లీ లో స్థానిక ఎమెల్య పులపర్తి అంజిబాబు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. శ్రీ మావుళ్ళమ్మవారి మహిమ తెలియనివారు ఉండరని.. భీమవరం ప్రజల బంగారు తల్లి శ్రీ మావుళ్ళమ్మవారి నిలువెత్తు విరాట్ స్వరూపం చేస్తే ఎవరికైనా శరీరంలో ప్రకంపనలు వస్తాయని రాష్ట్రంలో చాల మంది ఎమ్మెల్యేలు అమ్మను దర్శించుకున్న అనుభూతి ఉందని అన్నారు. నెల రోజుల ఉత్సవాలు ఆఖరి రోజు లక్ష మంది కి అన్నసమారాధన తెలుగునాట సుప్రసిద్దం అని అన్నారు. అటువంటి శ్రీ మావుళ్ళమ్మవారికి ఇప్పటికే 70 కేజీల బంగారు ఆభరణాలు ఎప్పుడు అలంకరించి ఉంచుతారని, ఇటీవల మరో 30 కేజిలతో బంగారు చీరతో ఒక కవచాన్ని కూడా త్వరలో భక్తుల సహకారంతో ఏర్పటు చేస్తున్నామని , దేశంలో 100 కేజీల బంగారంతో దర్శనం ఇచ్చే ఏకైక దేవత శ్రీ మావుళ్ళమ్మవారు మాత్రమే నని అయితే దేవాలయం వద్ద భద్రతా కరువయిందని రాష్ట్ర ప్రభుత్వం శ్రీ అమ్మవారి బంగారు ఆభరణాలు భద్రతా కోసం ఇద్దరు ఇద్దరు చప్పున 3 షిప్టులలో 6 గురు గన్ మెన్ లను ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే అంజిబాబు విజ్ఞప్తి చేసారు.
