సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో భక్తుల కోర్కెలను నెరవేర్చే ‘బంగారు తల్లి’గా ప్రసిద్ధి పొందిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 62వ వార్షిక మహోత్స వాలకు ఏర్పాట్లు నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యం లో రాష్ట్ర దేవాదాయ శాఖ దేవస్థానంసహకారంతో సుమారు 1 కోటి రూపాయలు ఖర్చుతో ఈనెల 13 నుంచి వచ్చే నెల 14 వరకు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. దేశంలోనే అత్యంత ధనవంతురాలైన ‘పుర’ దేవతగా బంగారు మనస్సు ఉన్న 10 అడుగుల శ్రీ మావుళ్ళమ్మ వారి మూలవిరాట్ స్వరూపానికి 100 కేజీల బంగారం ఆభరణాల అలంకరణ సంకల్పం ఉంది. దీనితో శ్రీ అమ్మవారి రూపంలో భీమవరం ప్రభ మరింత వెలిగిపోతుంది అని భక్తుల నమ్మకం.. అయితే ఇటీవల బంగారం ధరలు అనేక రేట్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శ్రీ అమ్మ వారిని నిలువెత్తు బంగారు చీరతో పూర్తీ స్వర్ణమర్ణ యం చేయడానికి దాతలు, భక్తుల నుంచి సుమారు గత 2 దశాబ్దాలుగా ఇప్పటివరకు 73 కిలోల బంగారం సేకరిం చగా 60 కిలోల వరకూ ఆభరణాలుగా తయారు చేసి, వజ్రాల కిరీటంతో సహా, అమ్మ వారికి స్వర్ణ అలంకారం చేసారు. అధికారుల నుండి అనుమతి రాగానే మరో 13 కిలోల బంగారం ఆభరణాల తయారీకి సిద్ధం చేశారు. శ్రీ అమ్మవారికి కొత్తగా వచ్చిన ధర్మకర్తల కమిటీ, బాగా కృషి చేస్తే స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రముఖులు భక్తుల సహకారంతో మరింత బంగారం సేకరించి శ్రీ అమ్మవారిని పూర్తీ బంగారు ఆభరణాలతో అలంకరించాలనే లక్ష్యం త్వరితంగా పూర్తీ చేస్తే చూడాలని శ్రీ అమ్మవారి భక్తుల ఆకాంక్ష..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *