సిగ్మా తెలుగు డాట్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, శుక్రవారం ఉదయం నుండి భక్తులు పోటెత్తిపోయారు. ఈనేపథ్యంలో పలువురు భక్తులు శ్రీ అమ్మవారికి విశేషంగా బంగారు కానుకలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి భీమవరం కి చెందిన తోట సూర్యార్జున రావు విజయ భారతి నాగలక్ష్మి దంపతులు 8 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు వీరికి ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *