సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నేటి గురువారం అల్పపీడనం కొనసాగుతోంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ ఆవరణము వరకు విస్తరించి ఉంది. ఇది నేటి రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తరం వైపుకు కదిలే అవకాశం ఉంది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
