సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వర్షాలు కాస్త తగ్గాయని కృష్ణ గుంటూరు, పల్నాడు జిల్ల్లాలలో జరిగిన విద్వంసం నుండి , 17 మంది మరణించడం కొందరు గల్లతయినా ఘటనల నుండి ప్రజలు ఈ రోజు మంగళవారం కాస్త తేరుకొంటుండగా..వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న తరుణంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కోస్తా మీదుగా కొనసాగుతోందని, రాష్ట్రంలో చెదురు మదురుగా వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.
