సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ‘హమూన్’గా తుపానుకు నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర , ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు బుధవారం బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టాగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. హమూన్ తుపాను కారణంగా భారత తీర ప్రాంతంపై..అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా తీరా ప్రాంతంలో జాలర్లు ఎవరూ బుధవారం వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
