సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. వాయవ్య , పశ్చి మ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపం లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు ఇది వాయవ్య బంగాళాఖాతం, దాని సరిహద్దులో ఉన్న పశ్చి మ మధ్య బంగాళా ఖాతం లో అల్పపీడనంగా బలపడనుంది. ఈ ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా,రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి వర్షాల ఉద్ధృ తి పెరగనుందని భారత వాతావరణ శాఖ(ఐఎం డీ)తాజా నివేదికలో ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *