సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ మధ్య బంగాళాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం మీదుగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలోకి తేమగాలులు వీస్తున్నాయి. దీనితో కోస్తా ఆంధ్ర గత 3 రోజులుగా వాతావరణం చల్లబడింది.పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఇంకా తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంటే నేడు, రేపు ఆదివారం వరకు వర్షపు జల్లులు పడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *